కాజల్ పై కన్నేసిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్!

kajal

సారాంశం : దక్షిణాది లో అగ్రహీరోలతో పాటూ కుర్ర హీరోలతో జత కట్టి హిట్లు కొడుతున్న టాలీవుడ్ హాట్ బ్యూటీ ‘కాజల్ అగ్రవాల్’, ఇప్పుడు మరో యంగ్ హీరో కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినీ నిర్మాత బెల్లం కొండా సురేష్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ‘బెల్లం కొండా సాయి శ్రీనివాస్’ తో ఈ బ్యూటీ జోడి కట్టనుంది. వరుసగా స్టార్ హీరోయిన్ ల జత కడ్తున్న ఈ యంగ్ హీరో, తన నెక్స్ట్ సినిమా కై కాజల్ పై కన్నేశాడు. కొత్త సినిమా లో ఈ సీనియర్ హీరోయిన్ తో ఆడీ, పాడనున్నాడు.

srinivas

ఇప్పటికీ సమంత, తామన్నహ్, రకుల్ ప్రీత్ లాంటి స్టార్ హీరోయిన్ ల తో నటించిన సాయి శ్రీనివాస్, ‘సాక్షి సినిమా లో పూజ హెడ్జ్ తో జోడి కట్టాడు. తాజాగా కాజల్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ని పరిచయం చేస్తున్న సినిమా లో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా లో సీనియర్ స్టార్ కాజల్ అగ్రవాల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసారు. కాజల్ అగ్రవాల్ ప్రస్తుతం చాల బిజీ గా ఉన్నపటికీ బెల్లం కొండా ఆఫర్ ని ఒకే చేసింది కాజల్. కధ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట ఈ బ్యూటీ. ఇప్పటికీ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

kajal

ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ‘సాక్ష్యం’ సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు ఈ బెల్లం కొండా వారి అబ్బాయి.

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *