‘బాలకృష్ణ’ తో నటించనున్న ‘శ్రీయా శరణ్’!

balakrishna

సారాంశం : టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ వివి వినాయక్ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్ని సినిమాలు చేసినా బాలకృష్ణ స్పీడ్ లో మాత్రం తేడా కనిపించే చాన్స్ లేదనిపిస్తోంది. ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా ఈ వయసులో కూడా చాలా ఎనర్జిటిక్ తో సినిమాలు చేస్తున్నారు.మే చివరివారంలో బాలయ్య, వినాయక్ కాంబినేషన్ లో మూవీ గ్రాండ్‌గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు.

balayya

ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా మరోసారి శ్రియ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. శ్రియను వివి వినాయక్ హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సి కల్యాణ్ నిర్మిస్తున్నారు. పెళ్లి తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు శ్రియ. శ్రియ, బాలకృష్ణ కాంబినేషన్‌లో చెన్నకేశవరెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

bala

ఇకపోతే ఈ కాంబినేషన్ లో సేమ్ హీరోయిన్ నటించడం స్పెషల్ అని చెప్పాలి. ఇక బాలయ్య తో అయితే నాలుగవసరి అవుతుంది. ఏజ్ లెస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియ బాలయ్య తో మరోసారి జత కట్టేందుకు రెడీ అవుతోంది. చెన్నకేశవ రెడ్డి – గౌతమి పుత్ర శాతకర్ణి అలాగే పైసా వసూల్ సినిమాలో బాలయ్య తో నటించిన శ్రియ నాలుగవసరి కూడా ఓకే చెప్పేసింది.

shreya

ప్రస్తుతం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసి బాలకృష్ణ సెంటిమెంట్ ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పైనే తన దృష్టిని ఉంచాడు. ఎలాగైనా ఆ సినిమాను ఒక దారికి తేవాలని ట్రై చేస్తున్నారు.

biopic-ntr

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *